పాన్ఐఐటీ అమరావతి కౌన్సిల్.. ఏపీ అభివృద్ధిలో ఐఐటీ నిపుణుల భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ను సాంకేతికత, ఆవిష్కరణలు, డీప్టెక్ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు పాన్ఐఐటీతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భాగస్వామ్యం మరో కీలక ముందడుగుగా మారింది. రెండు రోజుల పాన్ఐఐటీ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఐటీ పూర్వ వి
Pan iit


అమరావతి , 05 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ను సాంకేతికత, ఆవిష్కరణలు, డీప్టెక్ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు పాన్ఐఐటీతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భాగస్వామ్యం మరో కీలక ముందడుగుగా మారింది. రెండు రోజుల పాన్ఐఐటీ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఐటీ పూర్వ విద్యార్థులు దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఐదు లక్షల మంది ఐఐటీ పూర్వ విద్యార్థులతో కూడిన నెట్వర్క్ను రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానించాలనే లక్ష్యంతో పాన్ఐఐటీ అమరావతి కౌన్సిల్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి.

అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా భవిష్యత్ సాంకేతిక, ఆవిష్కరణ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఐఐటీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమలు, ప్రభుత్వ వ్యవస్థ మధ్య సమన్వయం పెంచితే కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, పరిశోధనా ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఐఐటీ పూర్వ విద్యార్థుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్త నెట్వర్క్, పరిశ్రమల అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. దేశ నిర్మాణం కోసం ఐఐటీలు చదివిన వారంతా ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. రాష్ట్రానికి అవసరమైన సృజనాత్మక, వినూత్న, కొన్నిసార్లు సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు కూడా ఐఐటీ నిపుణుల నుంచి అవసరమని సీఎం పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande