
న్యూఢిల్లీ, 05 అక్టోబర్ (హి.స.)
కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా నేడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్య న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది.
వార్తా కథనాలు వందశాతం నిజం కావచ్చు. ఒక్కోసారి తప్పు కూడా కావచ్చు. కేవలం పత్రికా కథనాన్ని ప్రాతిపదికగా తీసుకుని మేము ఈరోజే ఉత్తర్వులు ఇవ్వలేము. దీనిపై ఎన్నికల సంఘం సమాధానం వినాల్సి ఉంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం తీసుకున్న ఏ నిర్ణయమైనా చట్టానికి విరుద్ధంగా ఉందని తేలితే, దానిని మేము వెంటనే రద్దు చేస్తాం. ఇకపై ఎన్నికల సంఘంలో నిర్ణయాలు మెజారిటీ అభిప్రాయం ఆధారంగానే జరగాలి అని స్పష్టం చేసింది. సవరించిన 'ఫారమ్-6'కి తాము ఎలాంటి ఆమోదం తెలపలేదని, రికార్డులను పరిశీలించి మార్పులు ఎవరు చేశారో తేలుస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..