చట్ట విరుద్ధ కార్య కలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు.. ఏ ఎస్పి
చట్ట విరుద్ధ కార్య కలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు.. ఏ ఎస్పి
Police


ఆదిలాబాద్, 06 అక్టోబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కేంద్ర కాలనీలో మంగళవారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టాలను గౌరవించాలని సూచించారు.

సరైన వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, బీమా పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, గ్రామాల్లో నాటు సారా (గుడుంబా) తయారు చేయడం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను విక్రయించడం, చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి హెచ్చరించారు.

వాహనాల తనిఖీలో.... సరేనా పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, నంబర్ ప్లేట్లు లేని రెండు ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అలాగే 5 లీటర్ల గుడుంబా, ఎక్సైజ్ బీర్ 7 బాటిళ్లు, 5 కిలోల ఇప్పపువ్వును పట్టుకుని ధ్వంసం చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘించినా, నిషేధిత కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande