సర్వే బృందాలకు రైతులు సహకరించాలి.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సర్వే బృందాలు నిర్వహిస్తున్న రీ సర్వేకు రైతులు సహకరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
Collector


పెద్దపల్లి, 06 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సర్వే బృందాలు నిర్వహిస్తున్న రీ సర్వేకు రైతులు సహకరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ హాజరయ్యారు. 1938లో తొలిసారిగా నక్షా, రెవెన్యూ మ్యాప్ ఆధారంగా భూముల సర్వే ప్రారంభమైందని, సుమారు 70 ఏళ్ల అనంతరం ప్రభుత్వం చేపట్టిన భూభారతి రీ సర్వేలో భాగంగా ప్రస్తుతం ఉపగ్రహ సాంకేతికతతో భూములను సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఇందుర్తి గ్రామంలో సుమారు 1,700 ఎకరాల భూమిని గుర్తించి రీ సర్వే చేయనున్నట్లు చెప్పారు.

మొదట గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం, అనంతరం వ్యవసాయ భూముల సర్వే చేపడతామని తెలిపారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఉపగ్రహ సాంకేతికతతో భూముల హద్దులను గుర్తించి సర్వే చేస్తున్నట్లు వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande