భూముల వ్యవహారంపై ఈనెల 10న బిజెపి ప్రజెంటేషన్
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య భూముల వ్యవహారంపై విమర్శలు ప్రతివిమర్శలు పీక్స్ కు చేరుకున్న వేళ తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది.
Bjp


హైదరాబాద్, 06 అక్టోబర్ (హి.స.)

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య భూముల వ్యవహారంపై విమర్శలు ప్రతివిమర్శలు పీక్స్ కు చేరుకున్న వేళ తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని భూముల వ్యవహారంపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న భూ వ్యవహారాలపై బీజేపీ ప్రజెంటేషన్ ఇవ్వబోతోందని వెల్లడించారు.

ఈ ప్రజెంటేషన్ లో భూకంభకోణాలపై వివరిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆస్తులు బయటపెట్టింది ఒక శాతమేనన్నారు. 22-ఏలో తప్పిదాలు జరిగాయని మంత్రులు ఒప్పుకున్నారని ఫోరెన్సిక్ ఆడిట్ తో వాస్తవాలు బయటకు రావాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande