శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు.
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబు కు ఆహ్వానం


అమరావతి, 06 అక్టోబర్ (హి.స.)శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు.

ఈ మేరకు ఈరోజు(మంగళవారం) ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆపై శ్రీశైలం దేవస్థానం ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు.

అలాగే శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను ముఖ్యమంత్రికి దేవాలయ అధికారులు అందించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande