ఢిల్లీలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ.. తరలివచ్చిన విపక్ష నేతలు
ఢిల్లీలోని రామ్లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
CONGRESS


ఢిల్లీ , 01 నవంబర్ (హి.స.)

ఢిల్లీలోని రామ్లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కనాట్ప్లేస్ కూడలి నుంచి రామ్లీలా మైదానం వరకు నేతలు ర్యాలీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో రాజకీయ సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. వీరితో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర ప్రముఖ నాయకులు సభకు హాజరయ్యారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీల ప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నిరసన గళం వినిపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలనే నినాదంతో సభను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమిలోని ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రామ్లీలా మైదానం జనసందోహంతో నిండిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande