ఓటు వేయకుండానే బెంగళూరు వెళ్లిన జగన్
ఓటు వేయకుండానే బెంగళూరు వెళ్లిన జగన్
jagan


పులివెందుల, 01 నవంబర్ (హి.స.)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే బెంగళూరు పయనమయ్యారనే వార్త తీవ్ర రాజకీయ దుమరాన్ని రేపింది.

పులివెందులకు వచ్చిన జగన్, అక్కడ స్థానిక పోలింగ్ సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్రమాలకు, బోగస్ ఓటింగ్ మరియు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రోద్బలంతో పోలింగ్ బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్నారని, ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తిగా తుంగలో తొక్కి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆయన ఆరోపించారు.

ఈ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన ఓటు వేయడానికి ఆయన నిరాకరించారు. తక్షణమే నిరసనగా పులివెందుల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి, అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసి, ఆ పోలింగ్‌ను వెంటనే రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఓటు వేయకుండానే ఆయన పులివెందుల నుండి బెంగళూరుకు వెళ్లిపోయారు.

మరోవైపు అధికార కూటమి నేతలు వైఎస్ జగన్ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఓటమి భయంతోనే ఆయన నాటకాలు ఆడుతూ ఎన్నికలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, పోలింగ్ సజావుగానే సాగిందని తిప్పికొట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande