1000 కోట్ల క్లబ్ లో చేరిన రామాయణ మూవీ
రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ పౌరాణిక చిత్రం రామాయణ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
Ramayana


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)

రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ పౌరాణిక చిత్రం రామాయణ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన కేవలం ఎనిమిది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన 11వ భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల మార్క్ను దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. బాక్స్ ఆఫీస్ తాజా అంచనాల ప్రకారం.. రామాయణ దేశీయంగా ఇప్పటివరకు రూ.675.05 కోట్ల Gross Collection సాధించింది. ఇందులో రూ.564.60 కోట్ల Net Collection నమోదైంది. ఎనిమిదో రోజు అన్ని భాషల్లో కలిపి రూ.53.50 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. Overseas Market నుంచి రూ.358.50 కోట్లు రావడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.1,033.55 కోట్లకు చేరాయి. ఈ క్రమంలో పఠాన్, యానిమల్ సినిమాల Lifetime Collectionsను కూడా అధిగమించింది. వెయ్యి కోట్ల మార్క్ను అందుకోవడంలో రామాయణ కంటే ముందు పుష్ప-2: ది రూల్, ధురందర్: ది రివెంజ్ మాత్రమే ఉన్నాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande