
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,700 కిలోమీటర్ల సైక్లింగ్ యాత్రకు బయలుదేరుతున్న హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ సభ్యులను శనివారం అలై బలై ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది.హైదరాబాద్ రాంనగర్లో ఫౌండేషన్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ నెల 19న శ్రీనగర్‌లో మొదలుకానున్న ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. రాంబన్, పఠాన్‌కోట్, జలంధర్, అంబాలా, ఢిల్లీ, మథుర, గ్వాలియర్, ఝాన్సీ, సాగర్, లఖ్నాదోన్, నాగ్‌పూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, ధర్మపురి, కరూర్, మదురై, తిరునల్వేలి మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు.
యాత్రలో పాల్గొంటున్న వారికి దత్తాత్రేయ సత్కారం చేసి, జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైక్లింగ్‌ను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సైక్లింగ్ వల్ల శారీరక ఆరోగ్యం మెరుగవడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఈ యాత్ర యువతలో సానుకూల ఆలోచనలు పెంచి ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని అన్నారు. నషా ముక్త్ భారత్, నషా ముక్త్ తెలంగాణ స్ఫూర్తితో డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవితం గడపాలనే సందేశాన్ని తీసుకెళ్తున్న ఈ యాత్ర అభినందనీయమని, వారి ప్రయాణం సురక్షితంగా, విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు