
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)
తెలుగు సినిమా పరిశ్రమను తీవ్ర విషాదం కమ్మేసింది. సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో పుట్టిన గిరిబాబు, నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు.
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ పాత్రల్లోనూ వైవిధ్యంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన మరణ వార్తతో సినీ, రాజకీయ రంగాల్లోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు