
నాగర్ కర్నూల్, 14 నవంబర్ (హి.స.)
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 3,882 మందికి ప్రభుత్వ పెన్షన్లు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.
నేడు ఒక ప్రకటనలో ఆయన వివరాలను తెలియజేస్తూ., ఎన్నికల్లో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, దరఖాస్తులు తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు చేసిందని వివరించారు. ప్రభుత్వ పెన్షన్దారులలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు ఉన్నారని చెప్పారు.
సమాజంలోని పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అర్హులందరికీ పథకాలు అందేలా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు