కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.) ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం పొందే దిశగా ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతూ తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా మన్సుఖ్ మాండవీయతో జరిగిన భేటీ కూడా ఈ పర్యటనలో ప్రాధాన్యత సంతరించుకుంది.

సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొనడం విశేషం. కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే సమావేశంలో చర్చించిన అంశాలపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande