హరీశ్రావు నివాసానికి వెళ్లిన కేసీఆర్, కేటీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నానక్రామ్గూడలోని మాజీ మంత్రి హరీశ్రావు నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు.
kcr


హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నానక్రామ్గూడలోని మాజీ మంత్రి హరీశ్రావు నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. హరీశ్రావు తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరీశ్రావు కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తండ్రి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

కేసీఆర్, కేటీఆర్ ఒకే కార్యక్రమానికి హాజరుకావడంతో నానక్రామ్గూడలోని హరీశ్రావు నివాసం వద్ద బీఆర్ఎస్ నేతల సందడి నెలకొంది. పార్టీ ముఖ్య నాయకుల రాకతో ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఏర్పడింది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన అనంతరం కేసీఆర్, ఇతర నేతలు అక్కడి నుంచి వెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande