
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని మంత్రి వివరించారు. అనుమతుల ప్రక్రియలో జాప్యం కారణంగా ప్రాజెక్టుల పనులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరినట్లు చెప్పారు.
తెలంగాణలో సాగునీటి వసతులను మెరుగుపరచడం, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి ప్రాధాన్య అంశాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేంద్రం సహకారం లభిస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్