
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
వరుసగా రెండో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అంతగా సానుకూల సంకేతాలు లేకపోయినా, పీఎస్యూ బ్యాంకులు, రియాల్టీ షేర్లలో కొనుగోళ్లు జరగడం సూచీలకు బలాన్నిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం, విదేశీ మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం కూడా మార్కెట్కు కలిసొచ్చింది.
ఉదయం 82,150.62 పాయింట్ల దగ్గర స్వల్ప లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా పైస్థాయిలోనే కదిలింది. మధ్యలో 82,897.49 పాయింట్ల వరకు వెళ్లి గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 427.40 పాయింట్లు ఎగబాకి 82,532.19 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 96.30 పాయింట్లు లాభపడి 25,387.40 వద్ద స్థిరపడింది.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.47గా నమోదైంది. సెన్సెక్స్-30లో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ, టీసీఎస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..