
న్యూఢిల్లీ, 17 నవంబర్ (హి.స.)
భారత్ సమ్మిట్ 2026' (Bharat Summit 2026) వేదికపై జరిగిన పరిణామాల వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. భారత అంతర్గత రాజకీయాల్లో విదేశీయుల జోక్యం పెరుగుతోందని ఆరోపిస్తూ న్యాయవాది జాహిద్ అలీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.
ఈ సదస్సు వేదికగా కొందరు విదేశీ ప్రతినిధులు రాజకీయ నినాదాలు చేశారని పిటిషనర్ తన వ్యాజ్యంలో ప్రధానంగా ప్రస్తావించారు. సదరు విదేశీ నేత చేసిన వ్యాఖ్యలు భారతదేశ సార్వభౌమాధికారానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజకీయ వ్యవహారాల్లో విదేశీ ప్రతినిధుల ప్రమేయాన్ని నియంత్రించాలని, ఈ అంశంపై తగిన ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది జాహిద్ అలీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi