ఫిలిప్పీన్స్లోని అత్యంత పురాతన 'ఖల్సా దివాన్' గురుద్వారా పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన
ఫిలిప్పీన్స్లోని అత్యంత పురాతన 'ఖల్సా దివాన్' గురుద్వారా పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన
మోదీ


మనీలా, 17 నవంబర్ (హి.స.)

, నవంబర్ 17:ఫిలిప్పీన్స్‌లోని అత్యంత పురాతన గురుద్వారా అయిన 'ఖల్సా దివాన్' (Khalsa Diwan) పునరాభివృద్ధి పనులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మూడు రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా ఇవాళ (మంగళవారం) ఉదయం రాజధాని మనీలాలో ఉన్న ఈ చారిత్రక గురుద్వారాను మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పునరాభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 1901లో స్థాపించబడి, శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఖల్సా దివాన్ గురుద్వారా ఫిలిప్పీన్స్‌లోని సిక్కు సమాజానికి అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది. భారత్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, ప్రజా సంబంధాలకు ఈ గురుద్వారా నిలువెత్తు నిదర్శనమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. శతాబ్ద కాలం నాటి ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం తన అదృష్టమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ శంకుస్థాపన వేడుకలో ప్రధాని మోదీతో పాటు ఫిలిప్పీన్స్ సెనేటర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎస్కుడెరో, మనీలా నగర మేయర్ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనో, స్థానిక సిక్కు సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 23వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 21వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మనీలాలో పర్యటిస్తున్నారు.

జలియన్ వాలా బాగ్‌ను తలపించేలా జరిగిన ఈ అమ్కో సిమ్కో ఘటన బ్రిటిష్ క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనం. దేశం కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన ఈ జనజాతి వీరుల త్యాగాలను స్మరించుకోవడం, నేటి తరాలకు వారి చరిత్రను అందించడం మనందరి బాధ్యత.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande