కూకట్పల్లి ట్రక్ పార్క్ భూములపై నేడు కీలక సమావేశం
హైదరాబాద్లోని కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Telangana govt


హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ భూములకు సంబంధించిన అంశాలపై నేడు ప్రెస్క్లబ్లో సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు ఈ సమావేశంలో పాల్గొననుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రక్ పార్క్ భూముల విషయంలో నెలకొన్న వివాదం, భూముల భవిష్యత్తు, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఈ భూముల వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీపీఎం నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంపై ఆసక్తి నెలకొంది. వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడమే లక్ష్యంగా సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. హరీశ్రావు ఈ అంశంపై ఎలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande