
ఢిల్లీ, 02 నవంబర్ (హి.స.)
ప్రధాని నరేంద్ర
మోదీ వ్యాఖ్యలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అత్యంత ఘాటుగా స్పందించారు.ప్రతిపక్షాలు విదేశీ శక్తుల మద్దతుతో దేశాన్ని బలహీనపరిచేందుకు
యత్నిస్తున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.నిజానికి విదేశీ శక్తులు, కొన్ని కార్పొరేట్ శక్తుల సహాయంతోనే నరేంద్ర మోదీ ఈ దేశ ప్రధాని
పీఠాన్ని అధిరోహించారని రాహుల్ గాంధీ తీవ్ర ప్రత్యారోపణ చేశారు.
దేశంలో
ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసం, ఎన్నికల ప్రక్రియ
పారదర్శకత, మరియు పౌరుల ప్రాథమిక హక్కుల
పరిరక్షణ వంటి కీలక అంశాలపై నేరుగా తనతో బహిరంగ చర్చకు రావలసిందిగా ప్రధాని మోదీకి
రాహుల్ గాంధీ సవాల్ విసిరారు.ప్రధాని తగిన ధైర్యంతో చర్చకు సిద్ధపడితే, దేశ ప్రజల ముందు సత్యమేమిటో తేలిపోతుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ
విధానాలను, ఎన్నికల నిర్వహణలోని లోపాలను
ప్రశ్నించిన ప్రతిసారీ ప్రతిపక్షాల ముద్ర వేస్తూ, విదేశీ హస్తం ఉందంటూ దారి మళ్లించడం ప్రధానికి అలవాటుగా మారిందని
రాహుల్ మండిపడ్డారు.భారతదేశ
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను
కాపాడుకోవడానికి 'ఇండియా' కూటమి శక్తులు ఐక్యంగా పోరాడుతున్నాయని, ఈ పోరాటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు.
ఇటీవల 'రాష్ట్రీయ ఏకతా దివస్' వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కొన్ని శక్తులు విదేశీ శక్తుల అండతో దేశ ఐక్యతను దెబ్బతీయడానికి
కుట్రలు పన్నుతున్నాయని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాహుల్ గాంధీ నేరుగా ప్రధానినే లక్ష్యంగా
చేసుకుని విదేశీ సాయం ఆరోపణలు చేయడంతో పాటు ఓపెన్ డిబేట్‌కు సవాల్ విసరడంతో జాతీయ
రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.ఈ ఘాటు వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi