
ఆసిఫాబాద్, 27 నవంబర్ (హి.స.)
ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి మండలాల్లోని పలు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి శుక్రవారం నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను కోరారు.
స్థానిక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి అవసరాలకు అనుగుణంగా నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్న ఆయా గ్రామాలకు బస్ స్టాప్ లు, సర్వీస్ రోడ్లు, విద్యుత్ దీపాలు, కల్వర్టులు, ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు