ఔషధాలు, వైద్య పరికరాల దిగుమతి గేట్వేల విస్తరణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదన!
ఔషధాలు, వైద్య పరికరాల దిగుమతి గేట్వేల విస్తరణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదన!
హెల్త్


న్యూఢిల్లీ, 03 నవంబర్ (హి.స.)

దేశంలోకి ఔషధాలు,

వైద్య పరికరాలు మరియు

సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) దిగుమతి ప్రక్రియను మరింత సరళతరం చేయడంతో పాటు

సరఫరా గొలుసును వేగవంతం చేసే దిశగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ

శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అధీకృత

దిగుమతి కేంద్రాల (Import Gateways) సంఖ్యను గణనీయంగా విస్తరించాలని ప్రతిపాదిస్తూ ముసాయిదా

నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఈ సరికొత్త ప్రతిపాదనల ద్వారా వ్యాపార

సులభతర విధానాన్ని (Ease of Doing Business) ప్రోత్సహించడంతో పాటు అత్యవసర వైద్య

సామాగ్రిని సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం

ఉన్న నిబంధనల ప్రకారం నిర్దిష్టమైన కొన్ని ఓడరేవులు, విమానాశ్రయాలు మరియు భూ సరిహద్దు

మార్గాల ద్వారా మాత్రమే ఈ దిగుమతులు జరుగుతున్నాయి.దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రద్దీ

పెరిగి క్లియరెన్స్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాల నుంచి

ఫిర్యాదులు అందాయి.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మరిన్ని కొత్త ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు మరియు అంతర్జాతీయ

ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లను దిగుమతి గేట్‌వేలుగా గుర్తించి జాబితాలో చేర్చాలని

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.దీనిద్వారా ఫార్మా కంపెనీలు తమ సరుకులను

సమీప ప్రాంతాల నుంచే దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది.

అంతర్జాతీయ

ప్రమాణాలతో కూడిన మందులు మరియు వైద్య పరికరాలు దేశంలోకి సురక్షితంగా ప్రవేశించేలా

తగిన తనిఖీ కేంద్రాలు, డ్రగ్

ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణను కొత్త గేట్‌వేల వద్ద ఏర్పాటు చేయనున్నారు.ఈ

ప్రతిపాదనలపై వర్గాల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్‌ను అమల్లోకి

తీసుకురానున్నారు.ఈ విస్తరణతో ఫార్మా రంగానికి రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు

అత్యవసర సమయాల్లోనూ మందుల కొరత తలెత్తకుండా నివారించడానికి వీలవుతుందని నిపుణులు

అభిప్రాయపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande