
త్రిపుర, 03 నవంబర్ (హి.స.)
త్రిపురలోని ఆశాబరి (Ashabari) ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లపై కొందరు
దుండగులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనపై త్రిపుర ప్రభుత్వం మరియు భద్రతా
బలగాలు అత్యంత సీరియస్‌గా స్పందించాయి.జవాన్లపై
దాడికి పాల్పడిన ప్రధాన నిందితులతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు శనివారం
అరెస్ట్ చేశారు.చట్టాన్ని చేతిలోకి
తీసుకునే ఎవరినైనా ఉపేక్షించేది లేదని, నిందితులపై అత్యంత
కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పష్టం
చేశారు.
దేశ
సరిహద్దులను రక్షించడంతో పాటు అంతర్గత భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న భద్రతా
సిబ్బందిపై ఈ విధంగా దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమని సీఎం మాణిక్ సాహా
పేర్కొన్నారు.శాంతిభద్రతలకు విఘాతం
కలిగించే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.అరెస్టైన నిందితుల నుంచి మరింత సమాచారం
రాబట్టేందుకు విచారణ కొనసాగుతుండగా, ఆశాబరి ప్రాంతంలో
అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi