
కరీంనగర్ జిల్లా, 06 నవంబర్ (హి.స.)
కరీంనగర్ జిల్లా పరిధిలో ఇటీవల కేన్సర్ కేసుల సంఖ్య ఊహించని రీతిలో నమోదు అవుతుండటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం, జీవన శైలి మార్పులు మరియు ప్రారంభ దశలోనే నిర్ధారణ కాకపోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇవాళ జిల్లా కేంద్రాస్పత్రి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHC) వైద్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆరోగ్య అధికారులు ఈ అంశంపై చర్చించారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం అందించడంతో పాటు, ప్రజలలో ముందస్తుగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ప్రాముఖ్యతను వివరించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి గ్రామాల్లో వైద్య బృందాలు విస్తృతంగా పర్యటించి ప్రాథమిక పరీక్షలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్