జైనూర్ మండలంలో కోలాహలంగా దండారి-గుస్సాడి వేడుకలు – ఎమ్మెల్యే కోవలక్ష్మి సందడి
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జామిని గ్రామంలో ఇవాళ ఆదివాసీల అత్యంత పవిత్రమైన 'దండారి-గుస్సాడి' వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Tribal


కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, 06 నవంబర్ (హి.స.)

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జామిని గ్రామంలో ఇవాళ ఆదివాసీల అత్యంత పవిత్రమైన 'దండారి-గుస్సాడి' వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి నేరుగా పాల్గొని ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మహిళలు, గిరిజన పెద్దలు సాంప్రదాయ నృత్యాలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎత్మాసూర్ దేవతలకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని, దండారి కళాకారులతో కలిసి 'రేలా రేలా' పాటలకు ఉత్సాహంగా నృత్యం చేశారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande