
హైదరాబాద్, 06 నవంబర్ (హి.స.)
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ముసాయిదా జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.
ఎన్నికల ఫారాలు జారీ చేసినప్పటికీ ‘గైర్హాజరు, నివాసం మార్చిన, మరణించిన లేదా నకిలీ’ కేటగిరీల కింద గుర్తించి పేర్లు తొలగించిన ఓటర్లకు ఈ అవకాశం వర్తించనుంది. ఈ మేరకు నవంబర్ 6న ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రధాన ఎన్నికల అధికారులకు లేఖ జారీ చేసింది.
ఏఎస్డీడీ (ASDD) కేటగిరీల కింద పేర్లు తొలగించబడిన ఓటర్లు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు మరోసారి ఫారాలు సమర్పించుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసం తమ ప్రస్తుత సాధారణ నివాస పరిధిలోని ఎన్నికల నమోదు అధికారి (ERO) లేదా సహాయ ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించవచ్చు. సరిగ్గా పూర్తి చేసిన ఎన్నికల ఫారాలను సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఓటర్లు తమ పేర్లను మళ్లీ జాబితాలో చేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు