
నిర్మల్ జిల్లా, 06 నవంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా పరిధిలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన శ్రీరామ్‌సాగర్ (SRSP), కడెం మరియు స్వర్ణ ప్రాజెక్టుల్లో నీటి నిల్వల సామర్థ్యం గణనీయంగా తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు ఇవాళ అత్యవసర నిర్ణయం తీసుకున్నారు. రాబోయే వేసవి అవసరాలు మరియు ప్రజల తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఎస్సారెస్పీ కాలువల నుంచి సాగునీటి విడుదలను నిలిపివేసి, నీటిని కేవలం తాగునీటి ప్రయోజనాలకే కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. కడెం ప్రాజెక్టు నుంచి నవంబర్ 9 నాటికి సాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పైర్లకు సాగునీరు అందకపోతే భారీగా నష్టపోతామని, డిసెంబర్ మొదటి వారం వరకు నీటిని అందించాలని కోరుతూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్