
హైదరాబాద్ , 06 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) ఇవాళ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. 'మురసు' తుఫాను ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, దిగువ మట్టాల్లో వీస్తున్న గాలుల ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు (గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు తమ ధాన్యం కల్లాల్లో ఆరబెట్టిన పంటలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉష్ణోగ్రతలలో కూడా స్వల్ప మార్పులు నమోదువుతాయని, రాత్రి వేళల్లో చలితీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంద ని వెల్లడించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఉరుములు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్