
హైదరాబాద్, 07 నవంబర్ (హి.స.)
కొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చి, అక్కడి యువతకు సొంత పెద్దఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.
శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ అగ్రి ఎక్స్పో స్టాళ్లు చూసి, రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోలను ప్రారంభించారు. తర్వాత జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.
కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని శ్రీధర్ బాబు చెప్పారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడాన్ని ప్రోత్సహించి, దాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నామన్నారు. యువత ఉపాధి కోసం బయటకు వలస వెళ్లకుండా సొంత ప్రాంతంలోనే పని దొరికేలా చూస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఉద్యోగాలతో కొడంగల్‌కు కొత్త గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
ఎల్‌నినో ప్రభావం కేవలం తెలంగాణకే కాదని, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల కరువు వచ్చిందని మంత్రి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు