సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల.. మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
Minister


నాగర్ కర్నూల్, 07 నవంబర్ (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబానికి ఒక కల అని, ఆ కలను తీర్చడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అర్హులైన వారికి సంక్షేమ పథకాల లబ్ధి చేరుస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు కేవలం డబ్బు సాయం మాత్రమే కాకుండా, గౌరవంగా బతకడానికి అవసరమైన సొంత నివాసాన్ని ఇస్తున్నామన్నారు. ఇళ్లు నాణ్యతగా, చెప్పిన సమయానికే పూర్తయ్యేలా అధికారులు దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని సరిగ్గా వాడుకుని లబ్ధిదారులు తమ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అందరికీ సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande