
నిర్మల్, 07 నవంబర్ (హి.స.)
జిల్లాలో పేరుకుపోయిన సైబర్ కేసులపై నిర్మల్ ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
అందుకోసం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచే అన్ని స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సైబర్ వారియర్స్ను జూమ్లో ఒకచోటకు తీసుకొచ్చి సమీక్ష చేశారు.
బాధితులకు న్యాయం ఆలస్యం కాకూడదని ఆమె గట్టిగా చెప్పారు. సైబర్ కేసు ఏదైనా సరే, వెంటనే దర్యాప్తు మొదలుపెట్టి త్వరగా ముగించాలని, మధ్యలో ఆగిపోయిన ఫైలు ఏదీ అలాగే ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి కేసు ఎంతవరకు వచ్చిందో రోజూ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఎస్హెచ్ఓలకు చెప్పారు.
అంతేకాదు, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి డీడీల విషయంలో కూడా జాప్యం వద్దన్నారు. అవి కూడా వెంటనే తేల్చేయాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..