
ఢిల్లీ, 11 ఫిబ్రవరి (హి.స.)
పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం (huge earthquake) బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ భూకంపం సంభవించడంతో ప్రకంపనలు (vibration) భూమి లోపల దాదాపు 515 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమయ్యాయి. కాగా ఈ భారీ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం ప్రస్తుతానికి అందుబాటులోకి రాలేదు.
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాలలో అత్యధిక శాతం పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) అంచున ఉన్న ‘సర్కమ్-పసిఫిక్ సీస్మిక్ బెల్ట్’ లోనే సంభవిస్తాయి. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపాలలో దాదాపు 81 శాతం ఇక్కడే సంభవిస్తాయి. భూమి లోపలి టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని కిందకు ఒకటి చొచ్చుకుపోవడం (Subduction) వల్ల ఏర్పడే ఒత్తిడి, ఈ ప్రాంతంలో నిరంతరం భూకంపాలకు దారితీస్తుంది.
దాదాపు 40,000 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు సంభవిస్తుంటాయి. గణాంకాల ప్రకారం, ఏటా భూమిపై సుమారు 5 లక్షల భూకంపాలను గుర్తించగా, అందులో లక్ష వరకు ప్రజలు గమనించేలా ఉంటాయి. అయితే, కేవలం 100 భూకంపాలు మాత్రమే భారీ నష్టాన్ని కలిగిస్తాయి. 115 మిలియన్ ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ మండలం, నేటికీ భూగోళంపై అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతంగా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV