రాహుల్ గాంధీ పై అనర్హత వేటు.. లోక్సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన మోషన్
తెలంగాణ, 12 ఫిబ్రవరి (హి.స.)భారత పార్లమెంట్లో బడ్జెట్ పై ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ చ
బిజెపి ఎంపీ


తెలంగాణ, 12 ఫిబ్రవరి (హి.స.)భారత పార్లమెంట్లో బడ్జెట్ పై ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సభను కుదిపేశాయి. దీంతో రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ఎన్డీయే ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకునేందు సిద్ధం అయింది. ఈ మేరకు ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైనట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని మోడీ, మంత్రి హర్దీప్ సింగ్ పై రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేశారని కిరణ్ రిజిజు మండిపడ్డారు.

కాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన మోషన్ దాఖలు చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కీలక మోషన్ ను ప్రవేశపెట్టారు. సభలో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశ ప్రతిష్టను దిగజార్చే శక్తులతో ఆయన చేతులు కలిపారని ఈ సందర్భంగా దూబే సంచలన ఆరోపణలు చేశారు.

నిషికాంత్ దూబే తన మోషన్లో ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ (George Soros) పేరును ప్రస్తావించారు. దేశానికి హాని చేయాలని తలపెట్టే సోరోస్ వంటి శక్తుల సహాయంతో రాహుల్ గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఇది దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా, రాహుల్ గాంధీ లోక్సభసభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని (Termination of Membership), ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని దూబే తన నోటీసుల్లో డిమాండ్ చేశారు.

బుధవారం నాటి ప్రసంగంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజ్యాంగం, దేశ సమగ్రత గురించి మాట్లాడిన తీరును బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. సభలో లేని వ్యక్తుల గురించి, విదేశీ శక్తుల గురించి పార్లమెంట్లో చర్చకు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని అధికార పక్షం వాదిస్తోంది. ఈ వివాదం కారణంగా సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగి సభపలుమార్లు వాయిదా పడింది. రాహుల్ గాంధీపై దూబే ఇచ్చిన ఈ మోషన్ను స్పీకర్ స్వీకరిస్తారా లేదా అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. గతంలో కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల కారణంగా అనర్హత వేటును ఎదుర్కొని, సుప్రీంకోర్టు తీర్పుతో తిరిగి సభలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో బీజేపీ అస్త్రాలను సిద్ధం చేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande