నరవణే బుక్‌పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తు
ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అందులోని అంశాలను లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ అడ్డుకున్నారు. అంతేకాకుండా రాహుల్ గ
నరవణే బుక్‌పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తు


ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అందులోని అంశాలను లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ అడ్డుకున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ ఓం బిర్లా కూడా మైక్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మరుసటి రోజు పార్లమెంట్ ఆవరణలో నరవణే రాసిన పుస్తకాన్ని ప్రతిపక్ష నేత మీడియాకు చూపించారు. దీంతో కేంద్రం ఝలక్ అయింది. కేంద్రం నుంచి అనుమతి లేకుండా పుస్తకం ప్రచురణ ఎలా జరిగిందని అవాక్కైంది. దీంతో కేంద్రం విచారణ చేపట్టింది. అలాగే ఢిల్లీ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తాజాగా కేంద్ర దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నరవణే పుస్తకం లీక్ వెనుక అక్రమాలు జరిగినట్లుగా దర్యాప్తులో తేలింది. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ఒక ప్రణాళిక బద్ధంగా లీక్ అయినట్లుగా దర్యాప్తులో తేలింది. పుస్తకం ప్రింట్ కావడం.. వెంటనే ఆన్‌లైన్‌లో మొదట కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికాలో విక్రయాలు జరగడం ప్రారంభం అయ్యాయి. అమెజాన్‌లో పుస్తకం విక్రయం జరిగినట్లుగా కేంద్రం గుర్తించింది. పుస్తకం లీక్ వెనుక భారీ స్థాయిలో కుట్ర జరిగినట్లుగా భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande