
హైదరాబాద్, 12 ఫిబ్రవరి (హి.స.)చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ తిహాడ్ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో నేడు (ఫిబ్రవరి 12) విచారణ జరిగింది. ఇచ్చిన మాటను నటుడు గౌరవించలేదన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్యపై చెక్‌బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోగా.. వారు ఇచ్చిన కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయని సదరు సంస్థ ఫిర్యాదు చేసింది. పలుమార్లు విచారణ అనంతరం దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. రాజ్‌పాల్ యాదవ్ కొన్ని రోజుల క్రితం తిహాడ్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్