
డిల్లీ, 12 ఫిబ్రవరి (హి.స.)ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలకమైన డిఫెన్స్ డీల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన డీల్ ఇది. ఈ డీల్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఢిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత నావికా దళం కోసం 6 పీ8i విమానాలను కొనుగోలు చేసే డీల్‌ను కూడా ఆమోదించినట్టు తెలిపాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్‌తో భారత వాయిసేన పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల ద్వితీయార్థంలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగానే డిఫెన్స్ డీల్‌పై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. డీల్ ప్రకారం 18 రఫేల్ జట్లను 'ఫ్లై-అవే కండిషన్'లో నేరుగా తీసుకువస్తారు. తక్కిన 96 విమానాలు ఇండియాలో అసెంబుల్ చేస్తారు. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబెల్ కోసం రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, భారత్‌తోని ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారు. భారత వాయిసేన వద్ద ప్రస్తుతం 36 రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్