క్యాష్ తో వ్యాన్ డ్రైవర్ పరారీ.. రూ.57 లక్షలకు టోకరా
హైదరాబాద్, 13 ఫిబ్రవరి (హి.స.) గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలోని గోపన్పల్లిలో గురువారం సాయంత్రం ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ ఏజెన్సీ వాహనాన్ని డ్రైవర్ నగదుతో స
Future city


హైదరాబాద్, 13 ఫిబ్రవరి (హి.స.)

గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలోని గోపన్పల్లిలో గురువారం సాయంత్రం ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ ఏజెన్సీ వాహనాన్ని డ్రైవర్ నగదుతో సహా తీసుకుని పరారయ్యాడు. వివరాల్లోకెళితే సీఎంఎస్ (క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్) అనే సంస్థకు చెందిన వాహనం యాక్సిస్ బ్యాంక్ వద్దకు నగదు లోడ్ చేయడానికి వచ్చింది.

వాహనంలో డ్రైవర్ అజిత్ అలియాస్ శివ, ఇద్దరు కస్టోడియన్లు, ఒక గార్డు ఉన్నారు. కస్టోడియన్లు ఇద్దరు బ్యాంకు లోపల నగదు నింపే పనిలో ఉండగా సెక్యూరిటీ గార్డు వాష్రూమ్కు వెళ్లాడు. ఆ సమయంలో డ్రైవర్ అజిత్ ఒక్కడే వాహనంలో ఉన్నాడు. ఇదే అదనుగా భావించి అతను నగదు ఉన్న వ్యాన్ను తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. వాహనంలో సుమారు రూ. 57 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆ వాహనాన్ని తెల్లాపూర్ సమీపంలో వదిలివేసి, నగదుతో పరారయ్యాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande