
సంగారెడ్డి, 16 ఫిబ్రవరి (హి.స.)
ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో చేరిపోయింది. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమాతో ఉన్న ఆ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇక్కడే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మోతె సుమలత చైర్ పర్సన్ గా వైఎస్ చైర్ పర్సన్ గా పట్లోళ్ల మాధవి నరేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులుండగా 12 వార్డులు బీఆర్ఎస్, 10 వార్డులు కాంగ్రెస్, 4 వార్డులు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ వైపు, మరో స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ వైపు వెళ్లారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఊహించని విధంగా బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో మెజార్టీ రావడంతో మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో చేరింది. ఇక్కడ నీలం మధు సతీమణి కవితను చైర్మన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన వ్యూహాత్మక ఎత్తుగడలతో మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు