
నిజామాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.)
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా 49వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి మెజారిటీ కార్పొరేటర్ల మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్ పార్టీ 28 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని వెనక్కి నెట్టి, 14 సీట్లు గెలిచిన ఎంఐఎం, ఒకే సీటు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుతో చైర్ పర్సన్ పదవిని కొట్టేసింది. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ మేయర్ సీటును కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు కూడదీసుకుని ఎంఐఎం, బిఆర్ఎస్ మద్దతుతో కార్పొరేషన్ చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు