
రాజన్న సిరిసిల్ల, 16 ఫిబ్రవరి (హి.స.)
రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ (KCR) ప్రకటించిన పేరుకు, సీల్డ్ కవర్లో వచ్చిన పేరుకు మధ్య పొంతన లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం పార్టీ సీనియర్ నాయకుడు బుర్రా నారాయణ (Burra Narayana) పేరును కేటీఆర్ స్వయంగా ఇటీవలే ఖరారు చేసి ప్రకటించారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
అయితే, ప్రమాణ స్వీకార సమయానికి వచ్చిన సీల్డ్ కవర్ను అధికారులు విప్పగా.. అందులో చైర్మన్గా కళా చక్రపాణి, వైస్ చైర్మన్గా సందీప్ పేరు ఉండటంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, తమ నాయకుడి పేరును వైస్ చైర్మన్ ప్రకటించి తీరా ఎన్నిక సమయంలో మార్చడంపై బుర్రా నారాయణ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు