
సంగారెడ్డి, 16 ఫిబ్రవరి (హి.స.) కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గూడెం
మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) యూ టర్న్ తో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకుంది. తాజాగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని సైతం చేజిక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్గా మోటే సుమలత, వైస్ చైర్మన్ పట్లోళ్ల మాధవి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో ఓటు వేసి తిరిగి వెళ్తున్న గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటింగ్ ఎలా జరగిందని ప్రశ్నించగా.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేతను ఉద్దేశంచి ఆయన 'బుల్లెట్ దిగిందా లేదా' అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
కాగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 వార్డుల్లో విజయం సాధించారు. అందులో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ లోకి వెళ్లగా ఒకరు బీఆర్ఎస్లో చేరారు. దీంతో రెండు పార్టీల సంఖ్య 13కు చేరింది. దీంతో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న కాంగ్రెస్కు ఎంపీ రఘునందన్ రావు షాకిచ్చారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు