ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల విలువచేసే అక్రమ మద్యం పట్టివేత
ఖమ్మం, 16 ఫిబ్రవరి (హి.స.) ఆటోల నిండా సుమారు రూ.2.5 లక్షల విలువచేసే మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రమైన కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఆటో
Ndp liquor


ఖమ్మం, 16 ఫిబ్రవరి (హి.స.)

ఆటోల నిండా సుమారు రూ.2.5 లక్షల

విలువచేసే మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రమైన కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఆటో మద్యం సీసాలను ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.సుమారు రెండున్నర లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను కారేపల్లి 110 కనకదుర్గ వైన్ షాప్ మద్యం సీసాలుగా గుర్తించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ మద్యం దందా జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల బస్వాపూర్ వద్ద ఆటోలో తరలిస్తున్న ఆక్రమణ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు, సదరు వ్యక్తి పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వైన్ షాప్ యజమానులకు మద్యం అప్పజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమ దందా, ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యపు ధోరణి పై జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్ సెంటర్లోని వైన్ షాప్ యజమాని నాలుగు ఆటల ద్వారా విచ్చలవిడిగా గ్రామంలో మద్యం తరలిస్తూ పచ్చని ఏజెన్సీ గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు అడ్డు అదుపు లేదనే కోణంలో దందా సాగిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande