కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరిన భీంగల్ మున్సిపల్ చైర్మన్
నిజామాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా లోని భీంగల్ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొదిరె నాగమణి ప్రమాణస్వీకారం చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు వేరువేరుగా క్యాంపులకు బ
కాంగ్రెస్


నిజామాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా లోని భీంగల్ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొదిరె నాగమణి ప్రమాణస్వీకారం చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు వేరువేరుగా క్యాంపులకు బయలుదేరి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం క్యాంపు నుంచి తిరిగి వచ్చి నేరుగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా భీంగల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గా 6 వ వార్డు కౌన్సిలర్ బొదిరె నాగమణి, వైస్ చైర్మన్ గా పదో వార్డు కౌన్సిలర్ సంటి లతను ఎన్నుకున్నారు.

మొదటి మూడేళ్ల పాటు చైర్మన్ గా బొదిరె నాగమణి, చివరి రెండేళ్ల పాటు ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ నాగేంద్ర చైర్ పర్సన్ గా కొనసాగేలా పార్టీలో ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగానే మొదటి మూడేళ్ల పాటు మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగేందుకు బొదిరె నాగమణికి అవకాశం లభించింది. ఇక వైస్ చైర్మన్ గా మొదటి రెండేళ్లు సంటి లత, చివరి మూడేళ్లు రెండో వార్డు కౌన్సిలర్ పర్స కుశలత కొనసాగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఒప్పందం జరిగిందని, దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధిష్టానం నిర్ణయం మేరకే, అధిష్టానం సూచించిన కౌన్సిలర్లే చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande