తాండూరు మున్సిపాలిటీ పై 'కాంగ్రెస్' జెండా..!
వికారాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఫిబ్రవరి 1
Congress


వికారాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని

కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఫిబ్రవరి 13న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని సాధించడంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యూహం..

21 ఓట్లతో విజయం..

స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పట్టు సాధించింది. మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 19 మంది కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర (ఇండిపెండెంట్) సభ్యుని మద్దతు మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన ఎక్అఫీషియో ఓటును వినియోగించుకోవడంతో మొత్తం 21 ఓట్ల బలంతో నీరజ బాల్ రెడ్డి చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande