
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.)
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ సీసీఎస్ పోలీస్‌స్టేషన్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సీజ్ చేసిన వాహనాలు, మద్యం సీసాలు, స్వాధీనం చేసిన వస్తువులు దగ్ధమయ్యాయి. సీసీఎస్ పీఎస్ భవనం పక్కనే తహసీల్దార్, ట్రెజరీ, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. డీఎస్పీ ధీరజ్ వినిల్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ