బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్ను మూసారు
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.): బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర ) తండ్రి సునీల్‌ మల్హోత్ర కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 14న ఆయన మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తండ్రిని తలచుకుంటూ సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్ను మూసారు


అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.): బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర ) తండ్రి సునీల్‌ మల్హోత్ర కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 14న ఆయన మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తండ్రిని తలచుకుంటూ సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ఖరారైంది. ‘‘నిజాయతీ, విలువలతో జీవించారు. క్రమశిక్షణకు మారుపేరు. కాలం ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టినప్పటికీ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాడు. ధైర్యంగా అనారోగ్యాన్ని ఎదుర్కొన్నారు. స్ట్రోక్‌ ఆయనను వీల్‌ఛైర్‌కు పరిమితం చేసినప్పటికీ భయపడలేదు. చివరకు నిద్రలోనే తుదిశ్వాస విడిచారు’’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

తాను ఈ స్థానంలో ఉండడానికే కారణం తన తండ్రే కారణం అని సిద్ధార్థ్‌ గుర్తుచేసుకున్నారు. ఎప్పటికీ ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయన్నారు. 2023 ఫిబ్రవరి 7న సిద్ధార్థ్‌.. కియారాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande