ఏపీ అభివృద్ధికి కీలక అడుగు.. భారీ పెట్టుబడులకు SIPB ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో ఇవాళ(బుధవారం) 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు.
CM AP


హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో ఇవాళ(బుధవారం) 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులపై మాట్లాడారు. మొత్తం రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.

ఈ పెట్టుబడుల ద్వారా 56,692 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాశ్, సీఎస్ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande