అంబటి రాంబాబుకు బెయిల్.. రాజమండ్రి జైలు నుంచి విడుదల..
సంక్రాంతి లక్కీ డ్రా కేసులో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Ambati


హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)సంక్రాంతి లక్కీ డ్రా కేసులో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. గుంటూరు కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదల అయ్యారు.

2023 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సమయంలో మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని జనసేన నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవటంతో జనసేన జిల్లా అధ్యక్షడు గాదె వెంకటేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేసి, విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.

దీంతో ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు గుంటూరు కోర్టు విచారణ జరిపింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అంబటికి బెయిల్ మంజూరు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande