మదనపల్లి చిన్నారి హత్యాచార నిందితుడి ఆత్మహత్య
మదనపల్లి, 18 ఫిబ్రవరి (హి.స.) ఏడేళ్ల బాలికపై హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ ఓ చెరువులో శవమై తేలాడు. అన్నమయ్య జిల్లా కురబల కోట మం
police-suspect-suicide-of-the-accused-in-madanapalle-7-year-old-gir


మదనపల్లి, 18 ఫిబ్రవరి (హి.స.)

ఏడేళ్ల బాలికపై హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ ఓ చెరువులో శవమై తేలాడు. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం కనసానివారిపల్లి గ్రామంలో ఉన్న చెరువులో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ముదివేడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీసి, మృతుడిని కులవర్ధన్ గా గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు కులవర్ధన్ ఇంటివద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగా.. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కడప జిల్లా రాగిమానిదిన్నెపల్లెలో భారీ బందోబస్త్ నడుమ బాలిక అంత్యక్రియలు ముగిశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande