ముచ్చటగా మూడోసారి.. టాటా బోర్డ్ చైర్మన్గా మళ్లీ ఎన్.చంద్రశేఖరన్!
ముంబయి,19 ,ఫిబ్రవరి (హి.స.) టాటా సన్స్ చైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్ (N. Chandrasekaran) మరో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 24న జరగనున్న టాటా సన్స్ బోర్డు (Tata Sons Board) సమావేశంలో ఆయనకు మూడోసారి బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం లభించ
Tata board


ముంబయి,19 ,ఫిబ్రవరి (హి.స.) టాటా సన్స్ చైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్

(N. Chandrasekaran) మరో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 24న జరగనున్న టాటా సన్స్ బోర్డు (Tata Sons Board) సమావేశంలో ఆయనకు మూడోసారి బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం లభించవచ్చని వార్తలు వస్తున్నాయి. బోర్డు ఆమోదం తెలిపితే.. చంద్రశేఖరన్ 2032 వరకు చైర్మన్గా కొనసాగుతారు. ఆయన ప్రస్తుత రెండవ పదవీ కాలం ఫిబ్రవరి 2027తో ముగియనుంది.

టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ పదవులకు రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు మాత్రమే. అయితే, చంద్రశేఖరన్ 20285 65 ఏళ్లకు చేరుకుంటారు. కాబట్టి ఆయన కొనసాగింపు కోసం బోర్డు ప్రత్యేక మినహాయింపు ఇవ్వనుంది. మెజారిటీ వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్, ముఖ్యంగా చైర్మన్ నోయెల్ టాటా, చంద్రశేఖరన్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నట్లుగా సమాచారం. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఎయిరిండియా పునరుద్ధరణ కోసం టాటా గ్రూప్ ప్రణాళిక చేసిన 120 బిలియన్ల డాలర్ల పెట్టుబడులను నిర్వహించేందుకు ఆయన లీడర్షిప్ అవసరమని బోర్డు సమర్థవంతంగా భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande